తెలంగాణ ప్రభుత్వ పథకాలు

1.కల్యాణలక్ష్మి : ప్రారంభం :  2nd October 2015

                    ఉద్దేశం : S.C, S.T , B.C , ఇతరులలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించుటకు

                    2017 March 13th 51,000 to 75,116/-

 2018 March 19th 75,116/- to 1,00,116/-

2..షాదీ ముభారక్ : మైనారిటీలకు చెందిన నిరుపేద యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించుటకు 2nd October 2015  న ప్రారంభం

             2018 March 19th 75,116/- to 1,00,116/-

3. ఆరోగ్యలక్ష్మి : గర్బిణులకు , బాలింతలకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలలో 2015 January 1st న  ప్రారంభం

  3 to 6సం\\ల పిల్లలకు ప్రతి నెల 16 గుడ్లు ,ప్రతీ నెల మొదటివారంలో బాలామృతం అందిస్తారు.

4. ఒంటరి మహిళలకు జీవనభృతి : ఒంటరిగా నివసించే మహిళలకు ఆర్థిక అవసరాలు తీర్చుకొనుటకు నెలకు 1000/- సహాయాన్ని April 1st 2017 నుండి అందిస్తుంది.

5.మన ఊరు-మన ప్రణాళిక : నల్గొండ జిల్లాలో C.M  K.C.R గారు ప్రారంభించారు.గ్రామాలు సమగ్ర అభివృద్ది చెంది సుపరిపాలన దిశగా ముందుకు వెళ్ళడము కోసం

దీనినే గ్రామజ్యోతి పథకంలో భాగంగా అమలుపరుస్తున్నారు.

2015 July 26th న ప్రకటించిన పథకము.

2015 August 17th న వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లెలో  ప్రారంభం

7గ్రామాభివృద్ది కమిటీలు పనిచేస్తాయి. గ్రామీణ ప్రాంత అభివృద్దికి 2 నుండి 6 కోట్లు కేటాయిస్తారు

6. షీ క్యాబ్ : మహిళా డ్రైవర్లను ప్రోత్సహించుటకు ,వారు ఆర్థికంగా ఎదగడానికి 2015 September 8th న  ప్రారంభం

7.మిషన్ కాకతీయ : పల్లెల్లోని చెరువులను బాగు చేయుటకు 2015 March 12th న K.C.R గారు నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ గ్రామంలో ప్రారంభం.

ఉద్దేశం : రాష్ట్రంలోని   46,531 చెరువుల పునరుద్దరణ

8..మిషన్  భగీరథ : ఇంటింటికి త్రాగునీరు సరఫరా కోసం

వాటర్ గ్రీడ్ పైలాన్ ను C.M  K.C.R గారు నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో 2015 June 8th ఆవిష్కరించారు.

మోడీ గారు 2016 August 7th న మెదక్ జిల్లాలోని కోమటిబండలో  ప్రారంభించారు.

ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత త్రాగునీరు

గ్రామీణ ప్రాంతాలలో ప్రతీ వ్యక్తికి  100లీ\\ లు

మున్సిపాలిటీలలో  ప్రతీ వ్యక్తికి 135లీ\\ లు

పట్టణాలలో  ప్రతీ వ్యక్తికి  150లీ\\ లు

9. హరితహారం : రాష్ట్రంలో అటవీ సంపద పెంపుకు 2015 July 3rd న రంగారెడ్ది జిల్లాలోని చిలుకూరులో  K.C.R గారు ప్రారంభించారు.

2వ విడత నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లిలో 2016 July 4th న

3వ విడత 2017 లొ కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద

4వ విడత  2018 August 1st  న గజ్వేల్ నియోజకవర్గంలో  K.C.R గారు ప్రారంభించారు.

10.డబుల్ బెడ్రూమ్ ఇల్లు :  2015 October 2nd  న K.C.R గారు సూర్యాపేటలోని గొల్ల బజార్ లో, మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లిలో ,నర్సన్నపేటలో  ప్రారంభించారు.

11.TS-IPASS( Telangana State Industrial Project Approval and Self Certification System )

తెలంగాణ నూతన పారిశ్రామిక విధానమును 2015 June 12th న K.C.R గారు ఆవిష్కరించారు

12.TASK (Telangana Academy for Skill and Knowledge )

13.T-HUB : 2015 November 5th న గచ్చిబౌలీలోని IIIT Campus లో ప్రారంభము

Slogan :ఆలోచనలతో రండి – ఆవిష్కరణలతో వెళ్ళండి .

14.ఆహార భద్రత : B.P.L కుటుంబాల కోసం 2015 January 1st న ప్రారంభము

కుటుంబంలోని ప్రతీ మనిషికి 1 rupee/k.g చొప్పున  6కిలోలబియ్యం ఇస్తారు.

అంత్యోదయ అన్నయోజన కుటుంబాలకు 1 rupee/k.g చొప్పున  35కిలోలబియ్యం ఇస్తారు.

15. ఆసరా పెన్షన్స్: ఇది సామాజిక భద్రతా ఫించన్ల కార్యక్రమము.

2014 November 8th న K.C.R గారు మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు గ్రామంలో    ప్రారంభించారు

వికలాంగులకు నెలకు 1500/-

వృద్దులకు ,వితంతువులకు  ,చేనేత ,కల్లు గీత , బీడీ కార్మికులకు , H.I.V AIDS రోగులకు నెలకు 1000/-

16.FAST(Financial Assistance to Students of Telangana )

కే.జీ నుండి పీ.జీ వరకు ఉచిత విద్యతో పాటు ,భోధనా రుసుములు ,ఉపకార వేతనాల చెల్లింపుల కోసము

17.సుభోజనం: రైతులకు రూ\\ భోజనము

హైదరాబాద్ లోని బోయిన్ పల్లి లోని అంబేద్కర్ భవన్ లో సద్దిమూట పేరుతో 2014 July 24th న హరీష్ రావ్ గారు ప్రారంభించారు

2015 October 13th న సుభోజనంగా మార్పు.

18. హాస్టళ్ళకు సన్నబియ్యం : ప్రభుత్వ  హాస్టళ్ళలో ఉంటూ చదువుకుంటున్న  S.C, S.T , B.C విధ్యార్థులకు సన్నబియ్యం ఇచ్చే పథకం 2015 January 1st న ప్రారంభం.

19.S.T, Minority ల రిజర్వేషన్ ల పెంపు: తెలంగాణలో వెనుకబడిన తరగతులు,S.T ల రిజర్వేషన్ బిల్లు- 2017 ను : తెలంగాణ అసెంబ్లీ ఆమోదము.

ముస్లింల  రిజర్వేషన్ లను 4% నుండి  12% పెంపు

S.T ల రిజర్వేషన్ లను  6% నుండి 10% పెంపు

20.గొర్రెల పంపిణి : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ         

గొర్రెల పంపిణీని K.C.R గారు సిద్దిపేట జిల్లాలోని కొండపాకలో  2017 June 20th న ప్రారంభించారు.

గొర్రెల వైధ్య సహాయానికి 1962 Toll Free Number ఇచ్చారు.

21. K.C.R కిట్ పంపిణి : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెంచుటకు 2017 June 3rd న K.C.R గారు పేట్ల బురుజు ఆసుపత్రిలో ప్రారంభించారు.

గర్బిణీ స్త్రీలకు 12,000రూ\\ లను  3 విడతలలో ఇస్తారు .ఒకవేళ ఆడపిల్ల పుడితే 1000రూ\\ లను అదనంగా ఇస్తారు .

4000రూ\\ లను ప్రసవం కోసం చేరినప్పుడు

4000రూ\\ లను ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళే ముందు

4000రూ\\ లను టీకాలు వేయించిన తర్వాత ఇస్తారు .

వీటితో పాటు 16 వస్తువులతో  2000రూ\\ విలువైన కిట్ ను అందచేస్తారు.

22.e-పంచాయితీ ప్రాజెక్ట్ :నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేటలో K.T.R గారు ప్రారంభించారు

జనన ,మరణ దృవపత్రాలు ,పించన్లు ,కరెంటు బిల్లు చెల్లింపులు , పహాణీలు త్వరగా తీసుకునే సదుపాయం కల్పించారు.

23.స్వచ్చ తెలంగాణ – స్వచ్చ హైదరాబాద్ : 2015 May 16th న  K.C.R గారు ,గవర్నర్ నరసింహన్ ,కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలిసి హైటెక్ సిటీ దగ్గర ఉన్న  H.I.C.C లో ప్రారంభించారు.

24.రైతుబందు : 2018 May 10th న K.C.R గారు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్  నియోజకవర్గంలోని శాలపల్లి -ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు.

ఒక ఎకరానికి సంవత్సరానికి 8000రూ\\లను  2విడతలలో అందిస్తారు .

25. రైతుభీమా : 15th May 2018 న K.C.R గారు ప్రకటించారు.

15th August 2018 నుండి అమలుచేస్తారు.

5,00,000/- ల ఉచిత భీమాను రైతులకు  L.I.C ద్వారా అందిస్తారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *