ఆన్ లైన్ లో డబ్బు ఎలా సంపాదించగలం?

డబ్బంటే ఎవరికి చేదు? అందరికీ డబ్బు కావాలి, కానీ కొంత మందే డబ్బు ని సంపాదించే కళ లో బాగా ముందుంటారు. ఈ టెక్నాలజీ యుగం లో ఇంటి నుంచి కదలకుండా కూడా డబ్బు సంపాదించవచ్చు, ఇదంతా కేవలం ఇంటర్ నెట్ ద్వారా మాత్రమే సాధ్యం. ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించటం ఎలా సాధ్యమో ఈ పోస్ట్ లో చూద్దాం.

ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదన నిజమేనా?

అవును, ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఏదైనా టాలెంట్ ద్వారా ఆ టాలెంట్ ని ప్రజలకి ఉపయోగ పడుతూ నెట్వర్క్ పెంచుకుని కష్టపడి పనిచేయటం ద్వారా మనం ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించవచ్చు.

ఉదాహరణ: తెలుగులో జనరల్ నాలెడ్జీ పైన ఒక బ్లాగు ఉంది [https://cckrao2000.blogspot.com], సి.సి.కె.రావు గారు దాన్ని ప్రారంభించి చాలా సంవత్సరాలయింది, ఇప్పుడు వారు బ్లాగు ద్వారా పుస్తకాలని అమ్ముతున్నారు , ఇంకా యూటూబ్ చానెల్ కూడా మొదలుపెట్టారు. ఇదంతా వారు తమ సమయాన్ని వెచ్చించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధ్యార్థులకి ఉపయోగ పడేలా సమాచారాన్ని క్రమం తప్పకుండా అందించి నెట్వర్క్ ని పెంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమయింది కదా.

ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అయితే ఇందుకోసం కష్టపడాల్సి ఉంటుంది, ఈజీ అయితే అందరు చేసేవాళ్లు కదా.

ఆన్ లైన్ మనీ మార్గాలు

1. ఆక్టివ్ సంపాదన

2. పాసివ్ సంపాదన

ఆక్టివ్ సంపాదన

ఈ రకమైన సంపాదన మార్గంలో మీరు ఆక్టివ్ గా పనిచేసి డబ్బు సంపాదిస్తారు, ఉదాహరణకి ఆన్ లైన్ క్లాసులు, మీరు ప్రత్యక్షంగా ఆ పనిని ఆన్లైన్ లో చేస్తూ డబ్బు సంపాదించుకోవటం.

అయితే మీరు ఫ్రీ లాన్సింగ్ పద్దతిలో కనక పనిచేస్తున్నట్టయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు అన్ని వేళలా పని ఉండకపోవచ్చు, మీ నెట్వర్క్ పెరిగి మీకు ఎక్కువ క్లయింట్లు తెచ్చుకోగలగాలి, అలాగే కొంతమంది క్లయింట్లు సరిగా పే చేయకపోవచ్చు, కాబట్టి మీరు ఇలాంటి వాటికి ముందుగానే సిద్ధ పడాలి.

ఫ్రీలన్సింగ్ , ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ స్టోర్ ఇలాంటివి ఆక్టివ్ సంపాదన కిందకి వస్తాయి.

పాసివ్ సంపాదన 

మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనం సంపాదించగలుగుతున్నాం అంటే ఆ సంపాదన పాసివ్ సంపాదన గా అనుకోవచ్చు. ఆన్ లైన్ లో పాసివ్ సంపాదన మనం బ్లాగు , యూట్యూబ్ , ఆన్ లైన్ కోర్సులు లేదా పుస్తకాల అమ్మకాల ద్వారా, డ్రాప్ షిప్ స్టోర్స్ ద్వారా సంపాదించవచ్చు.

బ్లాగు కానీ , యూట్యూబ్ చానెల్ కానీ లేదా ఆన్ లైన్ కోర్సులు లేదా పుస్తకాలు ఇలా ఏదైనా సరే మీరు ఒకసారి దానిమీద పనిచేసారంటే మీరు పనిచేస్తున్నప్పుడు మాత్రమే కాక మీరు పని చెయ్యనప్పుడు కూడా వీటి ద్వారా డబ్బు సంపాదించగలుగుతారు.

అయితే మనం ముందే చెప్పుకున్నట్టు ఆన్ లైన్ వారా డబ్బు సంపాదించ వచ్చు కానీ ఈ కింది విషయాలని గుర్తుపెట్టుకోవాలి.

  • ఆన్ లైన్ లో డబ్బు సంపాదించటానికి టైం పడుతుంది.
  • ముందుగా మీరు కాస్త డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. [బ్లాగు లేదా వెబ్ సైట్ కావాలనుకుంటే].
  • నెట్వర్క్ పెంచుకోవాలి.
  • ఎక్కువ ట్రాఫిక్ వస్తేనే ఎక్కువ డబ్బు లు అని గుర్తు పెట్టుకోండి. 
  • మంచి అయిడియా లేదా టాలెంట్ ఉండాలి.
  • కష్టపడి పనిచేయాలి.

చదివారు కదా ఫ్రెండ్స్, మీకు ఏవయినా ప్రశ్నలు ఉంటే కామెంట్ లో రాయండి, మీకు కూడా యేదయినా అయిడియా ఉంటే ఆచరణ లో పెట్టండి. మీకు ఈ పోస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *